Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

విండోస్ vs అండ్రాయిడ్



ఇటీవల కాలంలో టెక్నాలజీ ప్రకారం ప్రతి విషయంలోను విండోస్ మొబైల్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఎంతో ప్రసిద్ది చెందినవే.
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్సుకు సంబంధించినదిగా ఉంటే విండోస్ మొబైల్ యాజమాన్య హక్కులు ఉన్నాయి
విండోస్ మొబైల్ సాపేక్షంగా పాతది, ఆండ్రాయిడ్ సరిక్రొత్త స్థాపించబడినది
విండో మొబైల్ చాలా రకాల ఫాన్లలో ఇప్పటికీ వాడుకలో ఉన్నవే కాని ఆండ్రాయి అనేవి కొన్ని మాత్రమే..
ఆండ్రాయిడ్‌తో పోలిస్తే విండో కోసం ఎక్కవ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి

విండోస్ ఫోన్..

మైక్రోసాఫ్ట్ దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, మోటోరోలా ఇంక్, తైవాన్‌ కు చెందిన హైటెక్ కంప్యూటర్స్ (హెచ్‌టీసీ) మరియు అశూష్‌టెక్ కంప్యూటర్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ ఈ సాఫ్టువేర్‌ను రూపొందించింది. ఈ సాప్ట్‌వేర్ ఆపిల్ ఇంక్‌ కంపెనీకి చెందిన ఐఫోన్, బ్లాక్ బెర్రీ డివైజ్, ఫిన్‌లాండ్స్ నోకియా వంటి హ్యాండ్ సెట్లలో ఆక్సెస్ అవుతుంది, ఈ విండోస్ మొబైల్ సాఫ్టువేర్‌తో సెల్‌ఫోన్ ద్వారా నచ్చిన పాటలను వినవచ్చు. మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విండోస్ మొబైల్ సాఫ్టువేర్‌కు మరిన్ని ఫీచర్స్‌ను జోడించి కొత్త వెర్షన్‌ను విఫణిలోనికి విడుదల చేసి. విండోస్ మొబైల్ ఫ్లాట్‌పాం ఆధారంగా పనిచేసే మొబైల్ ఫోన్స్ మరియు స్మార్ట్‌ఫోన్స్‌లలో కొత్త ఫీచర్స్‌తో తయారైన మ్యూజిక్ వెర్షన్‌లను ఈ సాఫ్ట్‌ వేర్ అందిస్తుంది.

ఆండ్రాయిడ్..

గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ ప్రసిద్దికెక్కింది. ఇటీవల గూగుల్ ఆండీ రూబిన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ సుమారు 700, 000 ఆండ్రాయిడ్ యాక్టివేషన్స్ జరుగుతున్నాయి.

గూగుల్ ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ ప్రారంభించిన అనతి కాలంలో ఎక్కువ మంది యూజర్స్‌ని పొందడమే కాకుండా, ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివేషన్స్‌కి సంబంధించిన సమాచారాన్ని కూలంకుషంగా చర్చించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మొబైల్ యూజర్స్ ఆండ్రాయిడ్‌కి స్టిక్ అవుతున్నారు.

ఆండ్రయిడ్ అనేది మొబైల్ పరికరాల కోసం ప్రాథమిక అప్లికేషన్ అనుసందానమైన ఓపెన్ హ్యాండ్‌సెట్ అలియన్స్ స్మార్ట్‌ఫోన్‌ల ఒపెన్ ప్లాట్‌ఫామ్ మరియు మీకు ఆండ్రయిడ్‌లో దొరికే అన్ని రకాల గేమ్‌లు, అఫ్లికేషన్లు ప్రధమంగా యునిక్స్ కోర్ మరియు ఆండ్రయిడ్ ఏపియై ఆదరపడి ఉంటాయి. కానీ, విడోస్ మోబైల్ అనేది మైక్రోసాఫ్ట్ విన్23 మరియు ఏపిఐలపై ఆధారపడిన మొబైల్ పరికరాల ప్రాథమిక అప్లికేషన్‌లతో కలిసిన కాంపాక్ట్ క్లోస్డ్ ప్రొప్రీయారిటీ ఆపరేటింగ్ సిస్టమ్.
నిరాకరణ