భారతదేశంలో చాలా మంది యువకులు నీరసం మరియు ఆనారోగ్య కారణాల వల్ల సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుండి దూరంగా ఉంటున్నారు" అని కామర్స్ చాంబర్ ఆస్సోచమ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసింది. దీని కోసం నిర్వహించిన ఒక సర్వేలో యువతియువకులు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్‌లపై చాలా తక్కువ సమయం గడుపుతున్నారని తెలిసింది. ఢిల్లీ, ముంబాయ్, చెన్నయ్, హైదరాబాద్ వంటి నగరాలలో సుమారు 12-25 వయస్సు గల 2000 మంది అబ్బాయిలు, అమ్మాయిలకు జరిపిన ఇంటర్‌వ్యూలో దాదాపు 55% మంది యువకులు సోషల్ మీడియా వెబ్‌సైట్‌పై ఎక్కువగా వినియోగిమచడం లేదని అన్నారు. ఇంకా 30% మంది ఆ సైట్‌ల నుండి విరమించకున్నారని ఇంకొంతమంది పూర్తిగా వారి అకౌంట్‌లను రద్దు చేసుకున్నారని సర్వేలో తేలింది.